
Earthquake: పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన జనాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం భూకంపం సంభవించి భయానక పరిస్థితిని సృష్టించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.
భూమి కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరలవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.
ఈ ప్రకంపనలు భూమికి 10 కి.మీ లోతులో సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు నిర్ధారించారు.
అంతేగాక ప్రకంపనలు కాశ్మీర్ వరకు విస్తరించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Details
రైళ్ల వేగాన్ని తగ్గించిన పాక్ ప్రభుత్వం
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రైల్వే శాఖ అప్రమత్తమై రైళ్ల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది.
అయినా హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇంతకుముందు, మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ భూకంపం హృదయ విదారక ఘటనగా నిలిచింది.
ఆ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు.
అక్కడ ఇప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భూకంపం వార్త ఆందోళన కలిగించేలా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
A magnitude 5.5 #earthquake just happened in Pakistanpic.twitter.com/eydgqc1lyC https://t.co/07zyevTzUb
— Hydrau | Earthly Insights (@Hydrau_) April 12, 2025