LOADING...
5 Billion Kg CO2: 50లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు.. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలే కాదు,పర్యావరణం కూడా ప్రమాదంలో
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలే కాదు,పర్యావరణం కూడా ప్రమాదంలో

5 Billion Kg CO2: 50లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు.. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలే కాదు,పర్యావరణం కూడా ప్రమాదంలో

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు అనేక సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా చమురు సంక్షోభం కారణంగా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇదే సమయంలో ఈ యుద్ధం పర్యావరణంపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో డ్రోన్లు, క్షిపణులు, బాంబులతో భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఫలితంగా విపరీత స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి.

వివరాలు 

రెండు వారాల్లోనే భారీ కార్బన్ ఉద్గారాలు

యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే సుమారు 50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలైనట్లు 'క్లైమేట్ అండ్ కమ్యూనిటీ' ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ ఉద్గారాల వల్ల పర్యావరణానికి దాదాపు 1.3 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా వేసింది. భవనాల ధ్వంసం వల్ల సుమారు 24 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల కాగా, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై జరిగిన దాడుల కారణంగా మరో 18 లక్షల టన్నుల ఉద్గారాలు వెలువడినట్లు పేర్కొంది. కేవలం 14 రోజుల్లో విడుదలైన ఈ కాలుష్య వాయువులు, ఒక దీవి ఏడాది మొత్తం ఉత్పత్తి చేసే కాలుష్యంతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

వివరాలు 

సముద్ర జీవ వ్యవస్థకు ముప్పు

హోర్ముజ్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లపై జరుగుతున్న దాడులు సముద్ర జలాలను విషపూరితం చేసే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. దీని ప్రభావంతో సముద్ర జీవులు భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని 'క్లైమేట్ అండ్ కమ్యూనిటీ' ఇన్‌స్టిట్యూట్ హెచ్చరించింది. ఆమ్ల వర్షాల ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు విడుదల కావడం వల్ల యుద్ధ ప్రాంతాల్లో ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది భూమి, నీరు, జీవవ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముంది.

Advertisement