Indian Woman Killed: సిడ్నీలో తీవ్రవిషాదం.. భారత్‌కు చెందిన 8 నెలల గర్భిణి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణ రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న సమయంలో అదుపుతప్పిన వేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు 8 నెలల గర్భిణి కావడం మరింత విషాదకరం. గత వారాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ అనే భారతీయ మహిళ, కుటుంబంతో కలిసి హార్న్స్‌బై ప్రాంతంలో నివసిస్తోంది. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఆమె తన భర్త, ముగ్గురేళ్ల కుమారుడితో సమీపంలోని పార్కులో నడకకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఫుట్‌క్రాస్ వద్ద రోడ్డు దాటుతూ ఉండగా, బీఎండబ్ల్యూ కారు అధికవేగంతో వచ్చి ఆమెను ఢీకొట్టింది.
వివరాలు
బీఎండబ్ల్యూ వాహనాన్ని నడిపింది 19 ఏళ్ల కుర్రాడు
ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సమన్వితను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువును కూడా రక్షించలేకపోయారు. మరో కొద్ది వారాల్లో ప్రసవించాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో, ఆమె భర్త తీవ్ర విచారంలో మునిగిపోయారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ వాహనాన్ని నడిపింది 19 ఏళ్ల ఆరోన్ పపాజోగ్లు అని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. సమన్విత స్థానికంగా ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో టెస్ట్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.