Loading...
UK: 12 నెలల్లో బ్రిటన్‌ను వీడిన 85 వేల మంది భారతీయులు.. అన్ని దేశాల కంటే టాప్!
12 నెలల్లో బ్రిటన్‌ను వీడిన 85 వేల మంది భారతీయులు.. అన్ని దేశాల కంటే టాప్!

UK: 12 నెలల్లో బ్రిటన్‌ను వీడిన 85 వేల మంది భారతీయులు.. అన్ని దేశాల కంటే టాప్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌ను వీడుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. 2026 జూన్‌తో ముగిసిన 12 నెలల కాలంలో ఏకంగా 85 వేల మంది భారతీయులు యూకే నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. అన్ని దేశాల వారితో పోలిస్తే బ్రిటన్‌ను విడిచిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. యూకే జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) విడుదల చేసిన తాజా వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్రిటన్‌ను వీడిన 85 వేల మంది భారతీయుల్లో 55 వేల మంది విద్యార్థులు కాగా, 28 వేల మంది ఉద్యోగ వీసాలపై అక్కడికి వెళ్లినవారు. మిగిలిన 2 వేల మంది ఇతర రకాల వీసాలపై బ్రిటన్‌లో నివసించినవారు.

వివరాలు 

బ్రిటన్‌లో తగ్గుతున్న నికర వలసల సంఖ్య  

భారతీయుల తర్వాత చైనా పౌరులు అత్యధికంగా బ్రిటన్‌ను వీడారు. ఏడాది కాలంలో 51 వేల మంది చైనీయులు యూకే నుంచి వెళ్లిపోయారు.

యూరోపియన్ యూనియన్ దేశాలను మినహాయిస్తే, బ్రిటన్‌ను విడిచిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు.

భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి వెళ్లిపోతుండటం గమనార్హం.

మరోవైపు బ్రిటన్‌లో నికర వలసల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.

2026 జూన్‌తో ముగిసిన ఏడాదిలో ఈ సంఖ్య 77 వేలకు పడిపోయింది. ఒక దేశంలోకి వచ్చిన వారి సంఖ్య నుంచి అక్కడి నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్యను తీసివేస్తే వచ్చే మొత్తాన్నే నికర వలసలు అంటారు.

2025 నవంబర్ నుంచి బ్రిటన్‌లో ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది.

వివరాలు 

భారతీయులకు భారీగా వీసాలు

ముఖ్యంగా భారత్, చైనా, నైజీరియా, పాకిస్థాన్ వంటి దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గడం, అక్కడి నుంచి తిరిగి వెళ్లేవారి సంఖ్య పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

బ్రిటన్‌ను వీడుతున్న భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడికి కొత్తగా వెళ్లేవారిలోనూ భారతీయుల వాటా గణనీయంగానే ఉంది.

2026 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం 77 వేల స్టడీ వీసాలు, 40 వేల ఉద్యోగ వీసాలు మంజూరు చేసింది.

దీంతో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు బ్రిటన్ ఇప్పటికీ ముఖ్యమైన గమ్యస్థానంగా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.

ఇదే సమయంలో బ్రిటన్‌కు వచ్చే మొత్తం వలసదారుల సంఖ్య కూడా తగ్గింది.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయులకు భారీగా వీసాలు

2025 జూన్‌తో ముగిసిన ఏడాదిలో 8.93 లక్షలుగా ఉన్న వలసదారుల సంఖ్య, 2026 జూన్ నాటికి 7.38 లక్షలకు పడిపోయింది.

అంటే ఏడాది వ్యవధిలో 1.55 లక్షల మంది తగ్గారు. మరోవైపు బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారి సంఖ్య కూడా 6.89 లక్షల నుంచి 6.61 లక్షలకు తగ్గింది.

ఈ మేరకు 28 వేల మంది తగ్గినట్లు ONS గణాంకాలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు 

అక్రమ వలసలపైనా ఆందోళన

మరోవైపు బ్రిటన్ హోం శాఖ కూడా 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదికి సంబంధించిన అక్రమ వలసలు,ఆశ్రయం కోరుతున్న వారి వివరాలను విడుదల చేసింది.

ఈ గణాంకాల ప్రకారం సుమారు 31వేల మంది అక్రమ మార్గాల్లో బ్రిటన్‌లోకి ప్రవేశించారు.

వీరిలో 86శాతం మంది ఇంగ్లిష్ ఛానల్ మీదుగా చిన్న పడవల్లో ప్రయాణించి దేశంలోకి వచ్చినవారే.

గత ప్రభుత్వహయాంలో గరిష్ఠ స్థాయికి చేరిన నికర వలసలను తమ ప్రభుత్వం 92శాతం తగ్గించిందని బ్రిటన్ హోంమంత్రి షబానా మహమూద్ తెలిపారు.

వలసల సంఖ్యను మరింత తగ్గించేందుకు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు.

అధిక వలసల వల్ల దేశ ఆర్థికవ్యవస్థతో పాటు ప్రజా సేవలపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆందోళనల నేపథ్యంలో వలసల నియంత్రణను బ్రిటన్ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యంగా తీసుకుంది.

ADVERTISEMENT