Pakistan fire accident: ఫైసలాబాద్‌లో గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో గమ్ (గ్లూ) ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీలో భయంకరమైన పేలుడు జరిగింది. బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో దాదాపు 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఎందుకు జరిగిందన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదని అధికారులు చెబుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది. పేలుడు ప్రభావంతో ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసం అవ్వడమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న ఇళ్లూ దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే ఫ్యాక్టరీ ఓనర్ అక్కడ్నుంచి తప్పించుకోగా, మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు
ణసంచా తయారీ కేంద్రంలోనూ పేలుడు
ఈ దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి మరయం నవాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేసి, సహాయక చర్యలను వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. పాకిస్థాన్‌లో పలుచోట్ల పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంటోంది. గత ఏడాది ఇదే ఫైసలాబాద్‌లో జరిగిన బాయిలర్ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే, కేవలం వారం క్రితమే కరాచీలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందిన ఘటన కూడా అక్కడి ప్రజలను కలవరపెడుతోంది.