
Iran-Israel: 'చరిత్రని మార్చే నిర్ణయం'.. అమెరికా దాడులపై నెతన్యాహు వ్యాఖ్య!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా (USA) బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ తాజా దాడులకు గాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు కృతజ్ఞతలు తెలిపారు. యూఎస్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం 'చరిత్రని మార్చేస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు నెతన్యాహు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Details
నెతన్యాహు వీడియో సందేశంలో ముఖ్యాంశాలు
'అధ్యక్షుడు ట్రంప్‌గారూ, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇరాన్ అణుకేంద్రాలపై అద్భుతమైన, ధర్మబద్ధ శక్తిని ప్రదర్శించారు. ఈ నిర్ణయం నిజంగా సాహసోపేతం, చరిత్రని మార్చేంత శక్తివంతం. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ద్వారా ఇజ్రాయెల్ అద్భుత ప్రయోజనాలు పొందింది. కానీ తాజాగా అమెరికా చేసిన అణుకేంద్రాలపై దాడులు అంతకంటే గొప్పవి, నిజంగా అద్వితీయమైనవి. భూగోళంపై మరే దేశం చేయలేనిది మీరు చేశారు. ప్రస్తుతానికి ఉన్న ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పాలనను, వారి వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసే విధానంలో ట్రంప్ వ్యవహరించడం చరిత్రలో నిలిచిపోతుంది. మేమెప్పుడూ 'బలమైన శక్తి ద్వారానే శాంతి నెలకుంటుంది' అని చెబుతుంటాము. ముందే శక్తిని ప్రదర్శిస్తే శాంతి స్వయంగా వచ్చేస్తుంది. ఇరాన్‌పై అమెరికా చేసిన దాడులు శక్తివంతమైనవి.
Details
తాజా పరిస్థితి ఇదే
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భీకర దాడులు నిర్వహించారు. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, విజయవంతంగా దాడులు జరిగాయని, ఇప్పుడు శాంతికి సమయమని పిలుపునిచ్చారు. ఇరాన్ మీడియా కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. ఈ దాడుల అనంతరం ట్రంప్, నెతన్యాహుతో ఫోన్ ద్వారా మాట్లాడుకున్నట్టు సమాచారం.