Page Loader
Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం
నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం

Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌ను మంగళవారం ఉదయం మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాలపాటు జరిగిన ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. టిబెట్‌లోని షిజాంగ్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ సహా పలు జిల్లాల్లో కనిపించింది.

Details

నేపాల్ భూభాగంలో తరచూ భూకంపాలు

భూకంపం ప్రభావం భారత్ ఉత్తరాది రాష్ట్రాలపై కూడా పడింది. దిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అదేవిధంగా చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రకంపనలతో వణికాయి. నేపాల్ భూభాగంలో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఆ విపత్తులో దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయారు.