Page Loader
Brazil Supreme Court: బ్రెజిల్‌లోని సుప్రీంకోర్టు సమీపంలో పేలుళ్లు.. ఒకరు మృతి 
బ్రెజిల్‌లోని సుప్రీంకోర్టు సమీపంలో పేలుళ్లు.. ఒకరు మృతి

Brazil Supreme Court: బ్రెజిల్‌లోని సుప్రీంకోర్టు సమీపంలో పేలుళ్లు.. ఒకరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్ సుప్రీంకోర్టు సమీపంలో ఇవాళ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలోని సుప్రీంకోర్టు,పార్లమెంట్, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఒక వ్యక్తి కోర్టు ప్రాంగణంలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అతన్ని అడ్డుకున్న సమయంలో పేలుళ్లు జరిగాయని బ్రెసిలియా డిప్యూటీ గవర్నర్ తెలిపారు. సంఘటనా స్థలంలో ఒక మృతదేహం కనిపించగా, పోలీసులు దాన్ని ధృవీకరించారు.

వివరాలు 

పేలుళ్లు సంభవించే ముందు ఆ ప్రాంతం నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రెజిల్ దేశ సొలిసిటర్ జనరల్ జార్జ్ ఈ ఘటనను ఖండించారు. అయితే, మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా, ఒక వ్యక్తి సుప్రీంకోర్టు బిల్డింగ్ వైపు పేలుడు పదార్థాలను విసిరినట్లు తెలుస్తోంది. పేలుళ్ల శబ్దాలు వినిపించగానే, ముందస్తు జాగ్రత్తగా బిల్డింగ్‌ను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లు సంభవించే ముందు ఆ ప్రాంతం నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా వెళ్లినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రెజిల్ సుప్రీంకోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు