
Sanae Takaichi: జపాన్ చరిత్రలో నూతన అధ్యాయం.. తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ దేశ చరిత్రలో కొత్త అధ్యాయనం మొదలైంది. 64 ఏళ్ల సనే తకైచి దేశం తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. మంగళవారం జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనే తకైచి అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే మెజార్టీ సాధించి విజయం సాధించారు. ఈ విజయంతో జపాన్‌లో పురుషుల ఆధిపత్య చరిత్రను సనే తకైచి మార్చారు. చక్రవర్తిని కలిసిన తరువాత ఆమె అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సనే తకైచి ఐదేళ్లలో జపాన్‌లో వచ్చిన ఐదో ప్రధానిగా నిలిచారు. అక్టోబర్ ప్రారంభంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం షింజిరో కోయిజుమిని ఓడించి తకైచి గెలిచారు. మాజీ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా రాజీనామా చేయడంతో పదవీ ఖాళీ ఏర్పడింది.
Details
భారత్ మద్దతు
సనే తకైచి 1993లో నారా నుంచి పార్లమెంట్‌లోకి ప్రవేశించి ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వం వంటి కీలక శాఖల్లో అనేక బాధ్యతలు నిర్వహించారు. స్వలింగ్ వివాహానికి వ్యతిరేకంగా ఉన్నారు మరియు బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అభిమానిగా ప్రసిద్ధి చెందారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సనే తకైచి ప్రథమ మహిళా ప్రధానిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. భారత-జపాన్ వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు లోతైన సంబంధాలు చాలా ముఖ్యమైనవని మోదీ ట్వీట్టర్ పేర్కొన్నారు.