Page Loader
షాకింగ్! పోర్చుగల్ పట్టణంలో 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ వరద; ఏమి జరిగిందంటే? 

షాకింగ్! పోర్చుగల్ పట్టణంలో 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ వరద; ఏమి జరిగిందంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2023
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో పట్టణంలోని వీధుల్లో ఆదివారం రెడ్ వైన్ నదిలా ప్రవహించింది. పట్టణంలో ఉన్న ఓ కొండపై నుంచి లక్షలాది లీటర్ల వైన్ ప్రవహించి వీధుల్లో ప్రవహించడంతో ఆ ప్రాంతంలో నివిసిస్తున్నవారు రెడ్ వైన్ ప్రవహిస్తున్న దృశ్యాలను వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్‌తో కూడిన బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు ఊహించని విధంగా పేలినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. వైన్‌ని ఆపడానికి ఫైర్ డిపార్ట్మెంట్ ప్రయత్నించి విఫలం అయ్యింది.కానీ అనాడియా అగ్నిమాపక విభాగం ఈ రెడ్ వైన్ ప్రవాహాన్నిసెర్టిమా నదిలో కలవకుండా వేరే వైపునకు మళ్లించింది. అక్కడి నుంచి వైన్ ప్రవాహం సమీపంలోని పొలంలోకి వెళ్ళింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీధుల్లో ప్రవహించిన రెడ్ వైన్