LOADING...
Japan: జపాన్‌ను తాకిన సునామీ.. 5అడుగుల ఎత్తులో అలలు.. రష్యా, కొరియా అప్రమత్తం 
Japan: జపాన్‌ను తాకిన సునామీ.. 5అడుగుల ఎత్తులో అలలు.. రష్యా, కొరియా అప్రమత్తం

Japan: జపాన్‌ను తాకిన సునామీ.. 5అడుగుల ఎత్తులో అలలు.. రష్యా, కొరియా అప్రమత్తం 

వ్రాసిన వారు Stalin
Jan 01, 2024
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌‌లో వరుసగా వరుస బలమైన భూకంపాల నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే సునామీ జపాన్ వాయువ్య తీరాన్ని తాకింది. దీంతో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు సముద్రపు అలలు 5మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు దేశాలైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష్యా అప్రమత్తమయ్యాయి. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంపాలు, సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్‌లో బుల్లెట్ రైలు సేవలను నిలిపివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తీరంలో రాకాసి అలల తీవ్రత

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భూకంపానికి కదులుతున్న వాహనాలు