
Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు వర్గాల దాడితో గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో బంధీలను విడుదల చేయడం కోసం ఇరు వర్గాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
ఐదు రోజుల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని వెల్లడించింది.
ఈ ఒప్పందంలో భాగంగా గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయనున్నాయి.
అలాగే ప్రతి 24 గంటలకు ఒక బ్యాచ్ బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు వాషింగ్టన్ వెల్లడించింది.
అయితే కాల్పుల విరమణ ఒప్పందంపై అటు హమాస్ కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ అధికారికంగా ప్రకటించలేదు.
హమాస్
ఒప్పందం కుదరలేదు: వైట్ హౌస్
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై తాజాగా అమెరికా స్పందించింది.
ఇజ్రాయెల్- హమాస్ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు వచ్చిన వార్తలను వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తోసిపుచ్చారు.
ఇంకా ఒప్పందం కుదరలేదని, అయితే ఒప్పందం కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన ఆకస్మిక దాడి తర్వాత దాదాపు 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే బంధీలను విడుదల చేసేందుకు యూఎస్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. హమాస్ ఎంతమందిని విడుదల చేస్తుందనేది స్పష్టంగా తెలియలేదు.