తదుపరి వార్తా కథనం

Thailand:థాయ్‌ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. 25 మంది విద్యార్థులు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 01, 2024
03:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్ సమీపంలో విద్యార్థులు, వారి టీచర్లతో ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుపోయింది.
ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు మరణించారు.
సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బస్సులో మొత్తం 44 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను మాత్రం రక్షించగలిగారు.
థాయ్‌ల్యాండ్ రవాణా శాఖా మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ సంఘటనపై స్పందించారు.
Details
థాయిలాండ్ ప్రధాని సంతాపం
ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు. సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని, ఇప్పటికే కొన్ని మృతదేహాలను గుర్తించామని చెప్పారు.
థాయ్‌ల్యాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది.