Alaska Aircraft : అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోవడంతో పైలట్ సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర ఘటనలో విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
విమానం టేకాఫ్ అయిన గంటలోపే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.
బెరింగ్ ఎయిర్‌కు చెందిన సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం గురువారం మధ్యాహ్నం, 9 మంది ప్రయాణికులు, ఒక పైలట్‌తో బయలుదేరింది.
Details
టెకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం
అప్పటికే అక్కడ తేలికపాటి హిమపాతం, పొగమంచు ఉన్నట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, వాతావరణం ప్రమాదకరంగా మారినట్లు తెలుస్తోంది.
కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మెక్‌ఇంటైర్ కోబుల్ మాట్లాడుతూ విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్‌మిటర్ అనే పరికరం ఉంటుందన్నారు.
ప్రమాదం సంభవించిన వెంటనే అది ఉపగ్రహానికి సంకేతం పంపుతుందని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో కోస్ట్ గార్డ్‌కు ఎలాంటి అలర్ట్ రాలేదని వెల్లడించారు.
ఈ విమానం కూడా నోమ్‌కు చేరుకోవాల్సి ఉండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం సంభవించింది.