
Israel-Hamas: ఇజ్రాయెల్-హమస్ మధ్య 'సంధి' పొడిగింపు.. నేడు మరికొంత మంది బందీల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ పేర్కొంది.
ఒప్పందంలో భాగంగా మంగళవారం హమాస్ విడుదల చేయనున్న బందీల జాబితా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అందుకుంది.
ఇదిలా ఉంటే, పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్య పరిష్కారంపై స్పెయిన్‌లో అరబ్ దేశాలు, యూరోపియన్ యూనియన్ మధ్య చర్చ జరిగింది.
ఈ సమావేశంలో అమెరికా ప్రతిపాదించిన 'రెండు దేశాల పరిష్కారం' అవసరమని అరబ్ దేశాలు, యూరోపియన్ యూనియన్ అంగీకరించాయి.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనాకు స్వతంత్ర దేశాలను ఏర్పాటుకు మద్దతు తెలిపాయి. గాజాను మాత్రం పాలస్తీనా అథారిటీ పాలించాలని ఈయూ పేర్కొంది.
అమెరికా
ఆంటోనీ బ్లింకెన్ పశ్చిమాసియా పర్యటన
హమాస్ గత మూడు రోజులుగా తన చేతిలో బందీలుగా ఉన్న 69మందిని విడుదల చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనియన్లను విడిపించింది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మళ్లీ సోమవారం నుంచి శనివారం వరకు ఇజ్రాయెల్, గాజా ఇతర పశ్చిమాసియా దేశాల్లో పర్యటించనున్నారు.
ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ పర్యటన సందర్భంగా బ్లింకెన్ గాజాలో హమాస్ చేతిలో ఉన్న మిగిలిన బందీల విడుదల, పాలస్తీనా ఎన్‌క్లేవ్‌కు మానవతా సహాయంపై చర్చిస్తామని అమెరికా తెలిపింది.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి తర్వాత.. పశ్చిమాసియాలో బ్లింకెన్ చేస్తున్న మూడో పర్యటన ఇది.