
Israel-Hamas War : గాజాలో వేల సంఖ్యలో మరణాలు.. 'డంబ్ బాంబ్సే' కారణమా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమస్ మధ్య పోరుతో గాజా వాసులు వణికిపోతున్నారు.
దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు.
ప్రస్తుతం అక్కడి ప్రజలకు సురక్షిత స్థానమంటూ లేకుండా పోయింది.
కచ్చితత్వం లేదని 'డంబ్ బాంబు' లను(dumb bombs) అధికంగా వాడటం వల్లే దీనికి కారణం కావొచ్చని అమెరికా నిఘా సంస్థ ఓ అంచనాకు వచ్చింది.
దీనిని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ కార్యాలయం రూపొందించిందని సీఎన్ఎన్ కథనంలో పేర్కొంది.
గాజాపై వినియోగిస్తున్న ఆయుధాల్లో కచ్చితత్వం లేని డంబ్ బాంబుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
అందుకే అవి జనావాసాలపై పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటోంది.
Details
చివరి పోరాడుతూనే ఉంటాం : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఉపయోగించిన 29వేల బాంబులలో 40-45 శాతం డంబ్ బాంబులే ఉన్నాయని వెల్లడించింది.
ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి స్పందిస్తూ తాము ఈ తరహా ఆయుధాలు వాడుతున్నామో చెప్పలేమని తెలిపారు.
ఒకవైపు తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా.. తమ సైన్యం గాజాలో పోరు కొసాగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.
చివరి వరకూ తాము పోరాడుతూనే ఉంటామని, బాధతో ఈ విషయాన్ని చెప్తుతున్నాని తెలిపాడు. మరోవైపు హమాస్ ప్రతిఘటన కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది.
ఇక ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయెల్ ఒకేసారి తొమ్మిది మంది సైనికులను కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ దాడుల్లో గాజాకు చెందిన సూమారు 18వేల మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్యశాఖ ప్రకటించింది.