Plane crash: అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం.. విమానంపై బుల్లెట్ రంధ్రాలు?
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కొన్ని కుట్రకోణాలు కూడా వినిపిస్తున్నాయి. అజర్‌బైజాన్‌లోని బాకు నగరం నుండి, రష్యాలోని చెచెన్ ప్రాంతం గ్రోజ్నికి ప్రయాణిస్తున్న ఈ విమానం, కజఖ్‌స్థాన్ లోని ఆక్టావ్ వద్ద కూలిపోయింది. విమానం పక్షి ఢీకొన్నప్పుడు పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి ప్రయత్నించినట్లు రష్యా ఏవియేషన్ వెల్లడించింది. అయితే ప్రమాద దృశ్యాలు చూసిన నెటిజన్లు, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో దీనికి సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కొన్ని నివేదికలు, ఆ సమయంలో డ్రోన్ దాడులు జరగడం కారణంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీన్ని కూల్చివేసిందని పేర్కొంటున్నాయి.
పైలట్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు
కొన్ని మీడియా కథనాలు, విమానం పైలట్ ప్రమాదానికి ముందు ఒక కాల్ చేసినట్లు పేర్కొన్నాయి. మరికొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్ చిహ్నాలు కనిపించాయని తెలిపారు. అయితే, కజకిస్థాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా ఈ అంశంపై కచ్చితమైన సమాధానం రాలేదు. క్రిస్మస్ సమయంలో కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగాయి. ఉక్రెయిన్ ప్రదేశ్ అధికారుల ప్రకారం, రష్యా 70 క్షిపణులు, 100 పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని విద్యుత్తు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఈ దాడులను ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున జరిపినట్లు ఆరోపించారు.