Page Loader
జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు 
జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు

జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు 

వ్రాసిన వారు Stalin
Oct 02, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది. సుబ్రమణ్యం జైశంకర్‌ను అద్భుతమైన ప్రతిభావంతుడిగా అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ రిచర్డ్ వర్మ అభివర్ణించించారు. భారత్- అమెరికా మధ్య ఆధునికు సంబంధాలు రూపశిల్పి జైశంకర్‌ అని పేర్కొన్నారు. ఆయన వల్లే ఇటీవలి సంవత్సరాల్లో భారత్- అమెరికా మధ్య సంబంధాలు గణనీయంగా బలపడ్డాయన్నారు. డొనాల్డ్ ట్రంప్‌ హయాంలోనూ, ఇప్పుడు జో బైడెన్‌ పాలనలోనూ ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడటానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారణం అన్నారు. జైశంకర్ గౌరవార్థం అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిచర్డ్ వర్మ ఈ వ్యాఖ్యలు చేసారు.

అమెరికా

జైశంకర్ విదేశాంగ మంత్రిగా ఉండకపోతే ఈ బంధం బలపడేది కాదు: రిచర్డ్ వర్మ 

ఈ శతాబ్దంలో అత్యంత కీలకమైన భాగస్వామ్యాల్లో భారత్- అమెరికా బంధం ఒకటని రిచర్డ్ వర్మ అన్నారు. ఇరుదేశాల మధ్య బంధం మహాత్మా గాంధీ -మార్టిన్ లూథర్ కింగ్ గొప్ప ఆలోచనలతో ముడిపడి ఉందన్నారు. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. అంతేకాకుండా అమెరికా-భారత్ మధ్య విబేధాలు ఉంటాయా? అనే దానిపై బెట్టింగ్ కూడా వేసుకోవచ్చు అన్ని చెప్పారు. జైశంకర్ అమెరికా-భారత్ కొత్త బంధానికి రూపశిల్పి అని కొనియాడారు. జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాలు పెరిగాయన్నారు. జైశంకర్ తనకు చాలా కాలంగా అనేక హోదాల్లో తెలుసునని, ఆయన విదేశాంగ మంత్రిగా ఉండకపోతే, ఇరు దేశాల మధ్య బంధం ఇంత బలంగా ఉండేది కాదన్నారు.