సముద్ర తాబేలు మాంసం తిని 9మంది మృతి.. 78 మంది ఆసుపత్రి పాలు
Sea turtle meat: ఆఫ్రికన్ దేశం టాంజానియా సమీపంలోని జాంజిబార్ (Zanzibar) దీవుల్లోని పెంబా ద్వీపం(Pemba Island)లో సముద్ర తాబేలు మాంసం తినడం తిని 9మంది చనిపోయారు. మరో 78మంది ఆరోగ్యం క్షీణించడంతో వారు ఆస్పత్రిపాలయ్యారు. చనిపోయిన వరిలో 8 మంది పిల్లలు, 1 మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి సముద్రపు తాబేలు మాంసం చాలా విషపూరితమైనది. కానీ జాంజిబార్ దీవుల్లోని ప్రజలు సముద్రపు తాబేలు మాంసాన్ని తినడం చాలా గౌరవంగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిన సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.
సముద్ర తాబేలు మాంసాన్ని తినొద్దు: విపత్తు నిర్వహణ బృందం
ఈ ఘటనకు సంబంధించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ.. శుక్రవారం అర్థరాత్రి విషపూరితమైన ఆహారం తిని ఓ మహిళ, 8మంది పిల్లలు చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన వారంతా సముద్ర తాబేళ్ల మాంసాన్ని తిన్నట్లు లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారించామని తెలిపారు. ఈ సంఘటన తర్వాత, తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలోని సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజిబార్ అధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు. సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని విపత్తు నిర్వహణ బృందం ప్రజలను కోరింది. అదేవిధంగా, నవంబర్ 2021లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా 7 మంది చనిపోయారు. ఆ సమయంలో మరో ముగ్గురు కూడా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.