సెంట్రల్ మాలిలో గ్రామంపై సాయుధుల దాడి 21మంది పౌరులు మృతి
సెంట్రల్ మాలి మోప్టి ప్రాంతంలోని ఒక గ్రామంపై తిరుగుబాటు దారులు విరుచుకుపడ్డారు. తుపాకులతో సాయుధులు రెచ్చిపోయారు. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించినట్లు అధికారులు చెప్పారు. సాయుధులు బండియాగరా పట్టణానికి సమీపంలోని యారౌ గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని మధ్యాహ్నం దాడి చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాయుధ గుంపు గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు మూలాలకు చెందిన ఒకరు ఫోన్ ద్వారా మీడియాకు వెల్లడించారు. ఈ కాల్పుల్లో 20 నుంచి 30 మంది మరణించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉన్నట్లు ఆ వ్యక్తి చెప్పారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలి అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ దాడులతో సతమతమవుతోంది.