Loading...
Iran: ఇరాన్‌లో 533 ఆనకట్టల వెనుక మిస్టరీ.. మ్యాప్‌తో బయటపడిన అసలు రహస్యం!
ఇరాన్‌లో 533 ఆనకట్టల వెనుక మిస్టరీ.. మ్యాప్‌తో బయటపడిన అసలు రహస్యం!

Iran: ఇరాన్‌లో 533 ఆనకట్టల వెనుక మిస్టరీ.. మ్యాప్‌తో బయటపడిన అసలు రహస్యం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నిఘా, వైమానిక దాడుల నుంచి తమ క్షిపణి తయారీ కేంద్రాలను కాపాడుకోవడానికి ఇరాన్ అనూహ్యమైన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిర్మించిన కొన్ని ఆనకట్టలు, నీటి సరఫరా పైప్‌లైన్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత సాధారణ నీటి ప్రాజెక్టులుగా కనిపించిన వీటి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే పలు సందేహాలు తలెత్తాయి. అసలు అక్కడ అంత భారీ సంఖ్యలో ఆనకట్టలు ఎందుకు నిర్మించారు? వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్నలు నిపుణులను సైతం ఆలోచనలో పడేశాయి. జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ నిమా షోక్రీ కూడా ఈ అంశంపై ఆసక్తి కనబరిచారు.

వివరాలు 

రాన్‌లోని పలు సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన అమెరికా 

ఇరాన్‌లో మొత్తం 533 ఆనకట్టలు నిర్మించినట్లు ఆయన గుర్తించారు. ఒకే దేశంలో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇంత భారీ సంఖ్యలో ఆనకట్టలు ఉండటం అసాధారణంగా అనిపించింది.

వాటి నిర్మాణం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే ఈ ఏడాది అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయనకు దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించాయి.

యుద్ధ సమయంలో అమెరికా వరుసగా ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడులు జరిగిన ప్రాంతాలను డాక్టర్ నిమా షోక్రీ ఇరాన్ మ్యాప్‌లో గుర్తించి పరిశీలించారు.

ఈ క్రమంలో ఆయన ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. గతంలో తాను ఆనకట్టలను గుర్తించిన ప్రాంతాలకు సమీపంలోనే అమెరికా వైమానిక దాడులు జరిగినట్లు గమనించారు.

వివరాలు 

సైనిక స్థావరాలకు నీటి సరఫరా కీలకం

దీంతో ఆ ఆనకట్టల నిర్మాణానికి, ఇరాన్ సైనిక స్థావరాలకు మధ్య సంబంధం ఉండొచ్చనే అనుమానాలు బలపడ్డాయి.

క్షిపణుల తయారీ కేంద్రాలు, ఆయుధ పరిశ్రమలు, ఇతర సైనిక స్థావరాలు నిరంతరం పనిచేయాలంటే నీరు, విద్యుత్తు వంటి వనరులు ఎంతో అవసరం.

ముఖ్యంగా ఆయుధ తయారీ ప్రక్రియల్లో నీటి వినియోగం కీలకంగా ఉంటుంది.

ఈ అవసరాలను తీర్చేందుకు సమీప ప్రాంతాల్లో ఆనకట్టలు, నీటి సరఫరా వ్యవస్థలను నిర్మించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

సైనిక స్థావరాలకు నీటి సరఫరా కీలకం

సాధారణంగా సైనిక స్థావరాలు దేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాలపై ఆధారపడతాయి.

అయితే ఇరాన్ మాత్రం తన క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక సముదాయాలు బాహ్య మౌలిక వసతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని ఇష్టపడలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అందుకే ఆయా కేంద్రాల అవసరాల కోసం ప్రత్యేకంగా ఆనకట్టలు, నీటి సరఫరా ప్రాజెక్టులను నిర్మించి ఉండొచ్చని చెబుతున్నారు.

ఇరాన్‌లోని క్షిపణి నగరాలు కూడా సాధారణ ప్రాంతాల్లో కాకుండా పర్వతాల అడుగున, భూగర్భ సొరంగాలు, ప్రత్యేక నిర్మాణాల మధ్య ఏర్పాటు చేసినట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా ఇలాంటి క్షిపణి కేంద్రాలు సుమారు 30 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీటిని గుర్తించడం ప్రత్యర్థి దేశాలకు కష్టతరంగా ఉండేలా నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

పర్యావరణవేత్తల అరెస్టుల వెనుక కారణం ఇదేనా?

ఇరాన్ 2018లో పెద్ద సంఖ్యలో వన్యప్రాణి సంరక్షకులు, పర్యావరణవేత్తలను అరెస్టు చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే ఈ అరెస్టుల వెనుక కూడా సైనిక రహస్యాలకు సంబంధించిన అంశాలు ఉండొచ్చనే అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి.

దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పర్యావరణ పరిశోధనలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు పర్యావరణవేత్తలు సైనిక స్థావరాలకు సమీపంగా వెళ్లి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

దీంతో వారిని అధికారులు అదుపులోకి తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

అప్పట్లో అరెస్టైన పర్యావరణవేత్తలు కెమెరాలను ఉపయోగిస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు.

అరెస్టయిన వారిలో ఒకరు జైలులోనే మరణించడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.

వివరాలు 

నీటి ప్రాజెక్టుల మాటున భూగర్భ క్షిపణి కేంద్రాలా?

ఇరాన్‌లోని యజ్ద్ ప్రాంతంలో నిర్మించిన భారీ నీటి ప్రాజెక్టు కూడా గతంలో నిపుణులకు అంతుచిక్కని ప్రశ్నగా ఉండేది.

ఆ ప్రాంతంలోనే అంత పెద్ద నీటి ప్రాజెక్టును ఎందుకు ఏర్పాటు చేశారనే విషయం చాలాకాలం వరకు స్పష్టంగా తెలియలేదు.

అయితే అమెరికా దాడుల తర్వాత అక్కడ భారీ క్షిపణి స్థావరం ఉన్నట్లు వెల్లడైంది.

దీంతో ఆ నీటి ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశంపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

ఇదే తరహాలో హర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని టారోమ్ రక్షిత ప్రాంతంపై కూడా జులైలో దాడి జరిగింది.

ఈ ప్రాంతంలో భూగర్భంలో సైనిక స్థావరం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

నీటి ప్రాజెక్టుల మాటున భూగర్భ క్షిపణి కేంద్రాలా?

అయితే అక్కడ సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రం లేదని, గడ్డి నిల్వ చేసే కేంద్రం మాత్రమే ఉందని పర్యావరణవేత్తలు పేర్కొనడం గమనార్హం.

మొత్తంగా చూస్తే ఇరాన్‌లోని కొన్ని ఆనకట్టలు, నీటి ప్రాజెక్టులు కేవలం సాధారణ నీటి అవసరాల కోసమే కాకుండా, భూగర్భ క్షిపణి కేంద్రాలు, సైనిక స్థావరాలకు అవసరమైన వనరులను అందించేందుకు నిర్మించి ఉండొచ్చనే విశ్లేషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అయితే ఈ నిర్మాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT