LOADING...
Al-Qaeda: పాకిస్థాన్‌కు అల్ ఖైదా సంచలన వార్నింగ్.. తాలిబాన్ ప్రభుత్వానికే మా మద్దతు
పాకిస్థాన్‌కు అల్ ఖైదా సంచలన వార్నింగ్.. తాలిబాన్ ప్రభుత్వానికే మా మద్దతు

Al-Qaeda: పాకిస్థాన్‌కు అల్ ఖైదా సంచలన వార్నింగ్.. తాలిబాన్ ప్రభుత్వానికే మా మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొంతకాలంగా పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌పై పాకిస్థాన్ దాడులు పెరగడంతో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా సంచలన హెచ్చరిక జారీ చేసింది. అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి తాము పూర్తిగా మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది. పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలు నిలిపివేయాలని గట్టిగా హెచ్చరించింది. ఈ విషయాన్నిసాహబ్ మీడియా ద్వారా విడుదల చేసిన రెండు పేజీల లేఖలో వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమాసియా దేశాలతో పాకిస్థాన్ సాన్నిహిత్యం పెంచుకోవడం,ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం చేయడంపై అల్ ఖైదా అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు,సైన్యం పాటించవద్దని కూడా పిలుపునిచ్చింది.తమ జిహాదీ లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలని కోరింది.

వివరాలు 

అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు

పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(Asim Munir)నేతృత్వంలో పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అల్ ఖైదా మండిపడింది. అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. తాలిబాన్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని లేఖలో స్పష్టంచేసింది. పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న డ్యూరాండ్ రేఖ(Durand Line)విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం అఫ్గానిస్తాన్ ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తుండగా, తాలిబాన్ బలగాలు కూడా పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అల్ ఖైదా హెచ్చరిక పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది.

వివరాలు 

క్షిణిస్తున్న పాక్ ఆర్థిక పరిస్థితి

ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దేశంలో ప్రస్తుతం ఆంక్షల వాతావరణం నెలకొంది. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అల్ ఖైదా నుంచి వచ్చిన హెచ్చరికతో పాకిస్థాన్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

Advertisement