LOADING...
Albania: ఏఐ మంత్రి గర్భవతి.. అల్బేనియా ప్రధాని వింత ప్రకటన
ఏఐ మంత్రి గర్భవతి.. అల్బేనియా ప్రధాని వింత ప్రకటన

Albania: ఏఐ మంత్రి గర్భవతి.. అల్బేనియా ప్రధాని వింత ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధస్సుతో (AI) పనిచేసే వ్యవస్థకు "మంత్రి" హోదా ఇచ్చిన అల్బేనియా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అల్బేనియా ప్రధాని ఇడి రామ ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం,దేశంలోని ఏఐ మంత్రి"డియెల్లా"గర్భవతిగా మారి,83 మంది "పిల్లలకు" తల్లి కాబోతున్నదని ప్రధాని ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో సోషలిస్ట్ పార్టీకి చెందిన ప్రతి సభ్యునికి ఒకరి చొప్పున మొత్తం 83 మంది ఏఐ సహాయకుల'ను తీసుకొస్తున్నప్రణాళికను ఆయన పై విధంగా తెలిపారు అంటే, ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా ఒక ఏఐ సహాయకుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. గత సెప్టెంబర్‌లో నియమితమైన ఈ ఏఐ మంత్రి"డియెల్లా"ను,అల్బేనియా సంప్రదాయ మహిళా దుస్తులు ధరించిన స్త్రీ రూపంలో చూపిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏఐ మంత్రి గర్భవతి.. 83 మంది పిల్లలకు తల్లి