
Russia: రష్యాలో కుప్పకూలిన ఆర్మీ కార్గో విమానం.. 15 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్గో విమానం మంగళవారం కుప్పకూలింది. విమానంలో 15మంది ఉన్నారని, వారందరూ మరణించారని అధికారులు పేర్కొన్నారు.
మాస్కోలోని ఈశాన్య ప్రాంతంలోని ఇవానోవో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పశ్చిమ రష్యాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం (ఇల్యుషిన్ ఇల్-76) కుప్పకూలింది.
టేకాఫ్ సమయంలో ఇంజిన్ మంటల కారణంగా ప్రమాదం సంభవించినట్లు రష్యా రక్షణ మంత్రి వెల్లడించారు.
ప్రమాదంలో సయమంలో విమానంలో 8మంది సిబ్బంది, 7మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాస్కో టైమ్స్ పోస్ట్ చేసింది. విమానం మంటల్లో కాలిపోతున్నట్లు దృశ్యం ఆ వీడియోలో కనపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగిన దృశ్యం
#BREAKING: Russian military plane crashes near Ivanovo, northeast of Moscow#militaryplanecrashes#planecrash #Ivanovo #Moscow#Russia #Ukraine #UkraineWar #UkraineRussianWar pic.twitter.com/n4pHkVjGjA
— kiran joshi (100% Follow Back) (@kiranjoshi235) March 12, 2024