Amazon Cargo: రన్‌వేపై అదుపుతప్పిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్యూర్టోరికో నుంచి వచ్చిన అమెజాన్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లి.. సమీపంలోని వాహనాలను ఢీకొట్టింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, భారీగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
రన్‌వే దాటి రోడ్డుపైకి..
విమానం మియామి విమానాశ్రయంలో దిగుతుండగా నియంత్రణ కోల్పోయింది.దీంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లి.. సమీపంలోని ఇతర వ్యాపార సంస్థల రాకపోకలకు ఉపయోగించే రోడ్డుపైకి దూసుకెళ్లింది.
అక్కడ ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
విమానంలో మంటలు వ్యాపించడంతో ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
విమానంలో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
విమానంలోని పైలట్,కోపైలట్‌తోపాటు వాహనాల్లో చిక్కుకున్న వారిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
విమానం కింద చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని కూడా రక్షించారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మరికొందరికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
వివరాలు
మృతులు ఎవరనేది తేలాల్సి ఉంది
ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు విమానంలోని వారా? లేక రోడ్డుపై ఉన్న వాహనాల్లోని వ్యక్తులా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. మృతుల వివరాలు, ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాహనాలను ఢీకొట్టి మంటల్లో కాలిన విమానం.. మియామిలో ఘోర ప్రమాదం
Footage shows the moment that the 21 Air Flight 7598 overran the runway and crashed at Miami International Airport. Per reports, at least 5 individuals are dead with an unspecified number of injuries. pic.twitter.com/cOKhKwoTwh
— OSINTdefender (@sentdefender) September 7, 2026