LOADING...
India-Russia Relations : మోదీ-పుతిన్ మీటింగ్‌పై అమెరికా కంగారు..?ట్రంప్‌ తదుపరి అడుగు ఏమిటి!
మోదీ-పుతిన్ మీటింగ్‌పై అమెరికా కంగారు..?ట్రంప్‌ తదుపరి అడుగు ఏమిటి!

India-Russia Relations : మోదీ-పుతిన్ మీటింగ్‌పై అమెరికా కంగారు..?ట్రంప్‌ తదుపరి అడుగు ఏమిటి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన ప్రపంచ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అమెరికా నుంచి వరుసగా వస్తున్న టారిఫ్‌ల బెదిరింపులు, ఆంక్షల ఒత్తిడుల మధ్య పుతిన్‌ భారత్‌లో అడుగుపెట్టడం అంతర్జాతీయ వర్గాలను మరింత ఆకర్షించింది. ప్రధాని మోదీతో ఆయన పలు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలకు సంతకాలు చేయడంతో వైట్‌హౌస్‌ పూర్తిగా సైలెంట్‌ అయ్యింది. ముఖ్యంగా ట్రంప్‌ ఏ పరిస్థితి రాకూడదని భావించాడో, అదే జరగడంతో యూఎస్‌ ప్రెసిడెంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ పర్యటనలో రక్షణ, ఇంధనం, అణుశక్తి, స్పేస్‌ టెక్నాలజీ, లాజిస్టిక్స్‌, ఆహార భద్రత, ఆరోగ్యం, ఇండస్ట్రీ, సముద్ర రంగం వంటి కీలక విభాగాల్లో భారత-రష్యా ప్రభుత్వాలు సహకారం విస్తరించే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Details

ప్యూర్ ఫ్రెండ్ షిప్ గా ప్రకటన

2030 వరకు ఆర్థిక సహకార రోడ్‌మ్యాప్‌ రూపొందించడమే కాక, 100 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక ట్రేడ్‌ లక్ష్యాన్ని ప్రకటించడం ద్వారా ఇరు దేశాలు ఎలాంటి బయటి ఒత్తిడులను లెక్కచేయబోమనే సందేశాన్ని ప్రపంచానికి స్పష్టంగా ఇచ్చాయి. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు మాస్కోతో భారత వాణిజ్యాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్న వేళ, పుతిన్‌-మోదీ భేటీ ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది. అధికారిక ప్రోటోకాల్స్‌ అన్నీ పక్కనబెట్టి, ఇద్దరూ స్నేహపూర్వకతను బహిరంగంగా ప్రదర్శించడాన్ని "నో ప్రోటోకాల్, ప్యూర్ ఫ్రెండ్‌షిప్‌"గా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తున్నాయి.

Details

ట్రంప్ వ్యూహంపై ఆందోళన

భారత్‌, రష్యా ఒంటరిగానో, ఒత్తిడిలోనో లేని దేశాలని, అనేక మిత్రదేశాల మద్దతు ఉన్న శక్తివంతమైన భాగస్వాములని చైనా కూడా తప్పనిసరిగా గుర్తించింది. ప్రపంచ రాజకీయ వ్యవస్థలో కొత్త మార్పులకు ఈ పరిణామం నిదర్శనం. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు తలొగ్గకుండా భారత్‌, రష్యా కలిసి ముందుకు సాగాలని సంకేతాలు పంపాయి. ఈ నేపథ్యంలో ఇకపై ట్రంప్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారా? లేక ఈ అసహనాన్ని మరో రూపంలో ప్రదర్శిస్తారా? అనేది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.

Advertisement