
అమెరికాలో దారుణం: 6నెలల పసిబాలుడిని కొరికి తినేసిన ఎలుకలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 6నెలల పసి బాలుడిని ఎలుకలు కొరికి తిని చంపేశాయి.
అవును మీరు విన్నది నిజమే, ఊయలలో నిద్రపోతున్న ఆరు నెలల పసి బాలుడిపై ఎలుకలు దాడి చేశాయి. అది కూడా ఎంతలా అంటే, బాలుడి ఎముకలు బయటకు కనిపించేలా కొరికి తినేసాయి.
ఈ సంఘటన ఆగస్టు 13వ తేదీన అమెరికాలోని ఇండియానాలో జరిగింది.
ఇండియానాలో నివసించే డేవిడ్, ఏంజెల్ సోనాబామ్ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిలో చిన్నవాడైన ఆరు నెలల పసికందును ఊయలలో వేసి బయటకు వెళ్లారు.
తిరిగి వచ్చేసరికి రక్తపు మడుగులో శిశువు కనిపించాడు. ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ పసి బాలుడు మరణించాడు
Details
తల్లిదండ్రులపై కేసు నమోదు
ఈ విషయమై పోలీసులు పసి బాలుడి తల్లిదండ్రులైన డేవిడ్, ఏంజెల్ సోనాబామ్ లపై కేసు నమోదు చేశారు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే డేవిడ్ నివాసంలో గతంలో కూడా పసి బాలుడిపై ఎలుకల దాడి జరిగిందని దర్యాప్తులో తెలుస్తోంది.
వాళ్లు నివసించే ఇల్లు పరిశుభ్రంగా లేకపోవడం, చెత్తాచెదారంతో ఇల్లంతా నిండిపోయి ఉండడం వల్లే ఎలుకలు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నాయని దానివల్లే పసి బాలుడిపై ఎలుకలు దాడి చేయగలిగాయని, అందుకే ఆ పిల్లాడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.