US Deportation: అక్రమంగా ప్రవేశించిన 487 మంది భారతీయులకు అమెరికా షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులపై బహిష్కరణ వేటు పడనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
487 మంది భారతీయులు తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చినట్లు యూఎస్ అధికారులు తమకు సమాచారం అందించారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు.
ఇప్పటికే యూఎస్ మిలటరీ విమానం సీ-17లో 104 మంది భారతీయులను సంకెళ్లలో బంధించి ఇండియాకు వెనక్కి పంపిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ కీలక ప్రకటన చేసింది.
Details
సంకెళ్లతో బంధించి అమృత్ సర్ కు పంపిన ఘటన
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారి మొత్తం సంఖ్యను తెలుసుకునేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని విక్రమ్ మిస్రి తెలిపారు.
ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం కూడా అక్రమ మార్గాలు, పద్దతుల ద్వారా ప్రవేశించిన భారతీయులను సంకెళ్లలో బంధించి అమృత్‌సర్‌కు పంపిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన భారతీయులను ఏ విధంగా తీసుకురాన్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది.