LOADING...
H-1B visa: వలసదారులపై అమెరికా అక్కసు.. చర్చనీయాంశమైన లేబర్ డిపార్ట్‌మెంట్ వీడియో  
వలసదారులపై అమెరికా అక్కసు.. చర్చనీయాంశమైన లేబర్ డిపార్ట్‌మెంట్ వీడియో

H-1B visa: వలసదారులపై అమెరికా అక్కసు.. చర్చనీయాంశమైన లేబర్ డిపార్ట్‌మెంట్ వీడియో  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. మాస్ డిపోర్టేషన్లు,అరెస్టులు,చట్టబద్ధమైన ప్రవేశాలపై ఆంక్షలు.. ఇవన్నీ ఆయన పాలనలో మరింత తీవ్రంగా మారాయి. అమెరికా ఆర్థికవ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ట్రంప్ ప్రభుత్వం తమ దృష్టిని మరింత పదును పెట్టింది. ఈనేపథ్యంలో హెచ్‌-1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ యంత్రాంగం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ "ఎక్స్"వేదికలో ఒక ప్రకటన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో కొన్ని కంపెనీలు హెచ్‌-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తూ,అమెరికన్ యువతకు బదులుగా విదేశీ కార్మికులను నియమిస్తున్నాయని ఆరోపించింది. ఆవీసాదారుల్లో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారని కూడా స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లేబర్ డిపార్ట్‌మెంట్ వీడియో విడుదల చేసిన వీడియో