LOADING...
Richard Wolff: భారత్‌పై అమెరికా టారిఫ్‌లు స్వీయ వినాశకరమేనన్న ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్
భారత్‌పై అమెరికా టారిఫ్‌లు స్వీయ వినాశకరమేనన్న ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్

Richard Wolff: భారత్‌పై అమెరికా టారిఫ్‌లు స్వీయ వినాశకరమేనన్న ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ అమెరికన్ ఆర్థిక నిపుణుడు రిచర్డ్ వోల్ఫ్ అమెరికా విధానాలను తీవ్రంగా ఖండించారు. ఆయన అభిప్రాయంలో, భారత్ విషయంలో అమెరికా ప్రపంచానికి పెద్దన్నట్లుగా ప్రవర్తిస్తున్నప్పటికీ, ఈ చర్యల వల్ల తన కాలిపై తానే గొడ్డలి పెట్టు వేసుకుంటోందని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన భారీ సుంకాలను ఆయన తప్పుబట్టారు. అమెరికా ప్రవర్తనను ఆయన "ఒక ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టే" అని ఆయన అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతం పెంచే నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

అమెరికా చర్యలతో బ్రిక్స్ కూటమి మరింత బలపడుతుందని విశ్లేషణ 

ఈ కొత్త విధానాన్ని బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. అమెరికా ఈ చర్యల ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థిక నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్ వోల్ఫ్ మాట్లాడుతూ, అమెరికా ఈ చర్యలతో భారత్‌కు ఎలాంటి ప్రభావం పడదన్నారు. "అమెరికా మార్కెట్ మూసుకుపోతే, భారత్ తన ఉత్పత్తులను బ్రిక్స్ దేశాలకు విక్రయిస్తుంది. రష్యా గతంలో ఇంధనాన్ని ఇతర దేశాలకు అమ్మిన విధంగా, భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది" అని ఆయన విశ్లేషించారు. అంతేకాక,అమెరికా చర్యలు పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని వోల్ఫ్ హెచ్చరించారు.

వివరాలు 

బ్రిక్స్ వాటా 35 శాతం, జీ7 వాటా 28 శాతం అని గుర్తు చేసిన వోల్ఫ్ 

ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాల వాటా (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈ) 35 శాతానికి చేరిందని, అదే సమయంలో జీ7 దేశాల వాటా 28 శాతానికి పడిపోయిందని ఆయన గుర్తుచేశారు. "ఇది చారిత్రక ఘట్టం. పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమిని అమెరికా దగ్గరగా పెంచి పోషిస్తోంది" అని ఆయన వివరించారు. గతంలో ట్రంప్ పలు సందర్భాల్లో బ్రిక్స్ కూటమిని "ఒక చిన్న బృందం" అని,"త్వరలో కనుమరుగవుతుందని" కొట్టిపారేశారు. ఉమ్మడి కరెన్సీ ప్రవేశపెట్టితే 100శాతం టారిఫ్‌లు విధిస్తామని కూడా హెచ్చరించారు. సోవియట్ కాలం నుండీ భారత్-రష్యా మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి.ఇప్పుడు అమెరికా ఒక భిన్నమైన,పటిష్ట ప్రత్యర్థి ఎదుర్కొంటోందని ఆయన స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న అమెరికా ఆర్థికవేత్త