Page Loader
Lottery: రూ 2,800 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. కానీ డబ్బులివ్వమన్న కంపెనీ 
రూ 2,800 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. కానీ డబ్బులివ్వమన్న కంపెనీ

Lottery: రూ 2,800 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. కానీ డబ్బులివ్వమన్న కంపెనీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాషింగ్టన్ డిసికి చెందిన ఒక వ్యక్తి,కి $340 మిలియన్ (₹ 2,800 కోట్లకు పైగా) జాక్‌పాట్ తగిలింది. జనవరి 6, 2023న జాన్ చీక్స్ పవర్‌బాల్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. రెండు రోజుల తర్వాత DC లాటరీ వెబ్‌సైట్‌లో లాటరి వివరాలు ప్రచురించారు. అందులో అతని నంబర్‌ ఉంది. దాంతో చీక్స్ ఆశ్చర్యయానికి గురైనట్లు గార్డియన్ తెలిపింది. లాటరీ గెలిచిన ఆనందంలో చీక్స్ డబ్బును కలెక్ట్ చేసుకోవడానికి పవర్‌బాల్ డీసీ లాటరీని సంప్రదించాడు. కంపెనీ వారు అతని నంబర్‌లు పొరపాటున ప్రచురించబడిందని తెలిపారు. దీంతో హతాశుడైన చీక్స్ తీవ్రంగా కలత చెంది.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆ వ్య‌క్తి లాట‌రీ కంపెనీపై కేసు వేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లాటరీ అమౌంట్‌ను చెల్లించేందుకు నిరాకరించిన కంపెనీ