Page Loader
టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 
టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు

టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 

వ్రాసిన వారు Stalin
Jun 13, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) ఒక ట్వీట్‌లో తెలిపింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:23 గంటలకు జిజాంగ్ ప్రాంతంలో 106 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది. తెల్లవారు జామున భూకంపం రావడంతో నిద్రపోతున్న జనం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ఇళ్లలోని పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చేసిన ట్వీట్