Indian Journalist: న్యూయార్క్‌లో భారత యువ జర్నలిస్ట్ మృతి.. కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగి భారతీయ జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు.
సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్‌మెంట్‌లో ఈ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకోవడానికి విద్యార్థులు కిటికీల నుంచి దూకారు.
ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
ఫాజిల్ ఖాన్ కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం టచ్‌లోనే అధికారులు పేర్కొన్నారు.
అమెరికా
'హేచింగర్ రిపోర్ట్'లో పని చేస్తున్న ఫాజిల్ ఖాన్
ఫాజిల్ ఖాన్ కొలంబియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఆయన ప్రస్తుతం 'హెచింగర్ రిపోర్ట్' అనే వార్తా సంస్థలో పని చేస్తున్నారు.
'హేచింగర్ రిపోర్ట్' అనేది విద్యలో అసమానత, ఆవిష్కరణలపై రిపోర్టింగ్ చేసే లాభాపేక్ష లేని వార్తాసంస్థ.
ఫాజిల్ 2018లో ట్రైనీ జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత CNN-న్యూస్ 18లో కూడా పనిచేశారు.
ఆ తర్వాత తదుపరి చదువుల కోసం 2020 సంవత్సరంలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళారు.
అతను దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టా అందుకున్నారు.