Page Loader
Fire Explosion : యెమెన్‌లో మళ్లీ కలకలం.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు వల్ల 15 మంది మృతి
యెమెన్‌లో మళ్లీ కలకలం.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు వల్ల 15 మంది మృతి

Fire Explosion : యెమెన్‌లో మళ్లీ కలకలం.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు వల్ల 15 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌లో గ్యాస్ స్టేషన్‌లో జరిగిన ఘోర పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఈ ఘటన బయ్దా ప్రావిన్స్‌లోని జహెర్ జిల్లాలో చోటుచేసుకుందని హౌతీ తిరుగుబాటుదారుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో 67 మంది గాయపడగా, వారిలో 40 మందికి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇంకా గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు. సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోల్లో భారీ మంటలు, వాహనాల ధ్వంసం, ఆకాశంలో పొగ మేఘాలు కనిపించాయి.

Details

ఇరుపక్షాల పరస్పర దాడులు

ఇజ్రాయెల్‌-హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతల నడుమ ఈ పేలుడు సంభవించింది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరుపక్షాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై హైపర్‌సోనిక్ క్షిపణులతో దాడులు చేపట్టగా, ఇజ్రాయెల్ ప్రత్యుత్తరంగా సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా హౌతీలు మరిన్ని ప్రతీకార చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని అనేక విమానాశ్రయాలు, రన్‌వేలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల మధ్య హింస కొనసాగుతున్న వేళ ఈ పేలుడు ఇజ్రాయెల్ పనే అని అనుమానం కూడా కొంతమందిలో వ్యక్తమవుతోంది.