French museum Heist: ఫ్రాన్‌లోని మరో మ్యూజియంలో దోపిడీ..!
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లావ్రే మ్యూజియం (Louvre Museum)లో జరిగిన చోరీ యావత్ ప్రపంచాన్నిషాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఫ్రాన్స్‌లో మరో మ్యూజియంలో కూడా దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో 2,000 బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి. ది మైసన్ డెస్ లుమైరేస్ (The Maison des Lumires) అనే మ్యూజియంలో దోపిడీ జరిగింది. లావ్రే మ్యూజియంలో చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే ఇది జరిగిందని సమాచారం. మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరిచినప్పుడు, ప్రదర్శన స్థలంలోని అద్దాలు విరిగి పడినట్లు గమనించారు. వెంటనే అధికారులు ఈ విషయాన్ని తెలుసుకుని దర్యాప్తుకు ప్రారంభించారు.
వివరాలు
లావ్రే మ్యూజియంలో దోపిడీ పింక్ పాంథర్స్ పని అయి ఉంటుందని అనుమానం
అపహరణకు గురైన 2,000 వెండి,బంగారు నాణేలు,మ్యూజియం పునరుద్ధరణ సమయంలో 2011లో కనుగొన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం,ఈ నాణేలు 1790, 1840 మధ్యకాలంలోవని స్థానిక మీడియా పేర్కొంది. ఇక, ప్రపంచ ప్రసిద్ధి పొందిన మోనాలిసా (Mona Lisa) అసలు చిత్రం ఉన్న లావ్రే మ్యూజియంలో ఆదివారం జరిగిన చోరీ కూడా తెలిసిందే. ఆ చోరీలో దొంగిలించిన విలువైన వస్తువుల మొత్తం సుమారుగా రూ.895 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. మ్యూజియంలోని నిఘా కెమెరాలు సక్రమంగా పనిచేయలేదని డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ తెలిపారు. ఈ దోపిడీకి ఎవరు పాల్పడ్డారనేది ఇప్పటివరకు తెలియలేదు. అయితే, కరుడుగట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ పని అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.