Page Loader
Plane crash: న్యూయార్క్‌లో మరో విమాన ప్రమాదం.. కౌంటీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద విషాదం
న్యూయార్క్‌లో మరో విమాన ప్రమాదం.. కౌంటీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద విషాదం

Plane crash: న్యూయార్క్‌లో మరో విమాన ప్రమాదం.. కౌంటీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద విషాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రోజు కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ ట్విన్‌ ఇంజిన్‌ విమానం, మద్యలో ఒక పొలంలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని కొలంబియా కౌంటీ అండర్‌షెరీఫ్‌ జాక్వెలిన్‌ సాల్వటోర్‌ తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే మృతుల వివరాలను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. మిత్సుబిషి ఎమ్‌యూ-2బీ విమానం, కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉన్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విమానం కౌంటీ విమానాశ్రయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణిస్తున్న సమయంలో, ఓ పొలంలో కుప్పకూలింది

Details

సహాయక చర్యలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం

వాతావరణ పరిస్థితులు సహాయక చర్యలపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అండర్‌షెరీఫ్‌ తెలిపారు. ఇంతకుముందు కూడా న్యూయార్క్‌లో ఒక పర్యాటక హెలికాప్టర్‌ ప్రమాదం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. జర్మనీలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం 'సీమెన్స్' కంపెనీ స్పెయిన్ విభాగానికి చెందిన సీఈఓ అగస్టన్ ఎస్కోబార్‌ తన కుటుంబంతో కలిసి హడ్సన్‌ నదిపై ప్రయాణిస్తున్న సమయంలో ఆ హెలికాప్టర్‌ నదిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎస్కోబార్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, పైలట్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు.