LOADING...
Anutin Charnvirakul: థాయ్‌లాండ్‌లో కొత్త ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్ ఎంపిక
థాయ్‌లాండ్‌లో కొత్త ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్ ఎంపిక

Anutin Charnvirakul: థాయ్‌లాండ్‌లో కొత్త ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్ ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ లో అనుతిన్ చార్న్‌విరాకుల్ (Anutin Charnvirakul)ను కొత్త ప్రధానిగా ఎంపిక చేసింది పార్లమెంట్. ఇది మాజీ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించిన అనంతరం వచ్చిన పరిణామం. భూమ్‌జైతై పార్టీకి చెందిన అనుతిన్, షినవత్ర నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. గమనార్హమైన విషయం ఏమిటంటే, గత రెండేళ్లలోనే థాయ్‌లాండ్‌కు ఇది మూడో ప్రధానిగా నియమితులుగా కావడం విశేషం.

Details

ప్రధాని పదవి నుండి తొలగింపు

కంబోడియా సెనేట్‌ అధ్యక్షుడు హన్‌సేన్‌తో షినవత్ర ఫోనులో మాట్లాడిన సంఘటన సంచలనం సృష్టించింది. సరిహద్దు వివాదాల క్రమంలో పొరుగుదేశం నేతతో కీలక విషయాలు పంచుకోవడం దేశీయంగా వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ న్యాయస్థానం ఆ వివరాలను పరిశీలించిన తరువాత, షినవత్ర నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్టు నిర్ణయించింది. దీంతో ఆమెకు ప్రధానిగా ఉండే అర్హత లేదని తీర్పు ఇచ్చి, పదవీ నుండి తొలగించింది.