LOADING...
Los Angeles riots: లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల నిరసనల ముసుగులో.. ఆపిల్ స్టోర్‌ లూటీ 
లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల నిరసనల ముసుగులో.. ఆపిల్ స్టోర్‌ లూటీ

Los Angeles riots: లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల నిరసనల ముసుగులో.. ఆపిల్ స్టోర్‌ లూటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్రమ వలసదారుల అరెస్టులపై లాస్ ఏంజెలెస్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమాలను అవకాశంగా తీసుకున్న కొందరు అసాంఘిక శక్తులు హింసాత్మకంగా ప్రవర్తించాయి. వారు ఆపిల్ స్టోర్‌తో పాటు అనేక వ్యాపార సంస్థల్లోకి చొరబడుతూ దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటనల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. డౌన్‌టౌన్‌ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్న వేళ, ముసుగులు ధరించిన కొందరు అనుమానాస్పద వ్యక్తులు ఆపిల్ స్టోర్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. వారు స్టోర్ కిటికీల అద్దాలను విరగ్గొట్టి, అందులోని ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. అంతేగాక, ఇతర వ్యాపార దుకాణాల్లోకి చొరబడి, ఆస్తిని ధ్వంసం చేశారు.

వివరాలు 

రంగంలోకి  పోలీసులు 

ఈ ఉదంతానికి స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలపై స్పందించిన లాస్ ఏంజెలెస్ పోలీస్ అధికారి క్రిస్ మిల్లర్, పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post