
Green Card applicants: అమెరికా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఈ పొరపాట్లను గమనించండి!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల నుంచి అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే గ్రీన్ కార్డు (Green Card) అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే సమయంలో చిన్న పొరపాటు కూడా తిరస్కరణకు దారితీస్తుందనే హెచ్చరికను అగ్రరాజ్య U.S. Citizenship and Immigration Services (USCIS) తాజాగా ఇచ్చింది. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఫారమ్ I-485ను పూర్తిచేయాలి. అయితే USCIS గుర్తించినట్లు పార్ట్-9లో అడిగిన ప్రశ్నలకు చాలామంది సమాధానాలు ఇవ్వడం లేదని, దాంతో దరఖాస్తులు తిరస్కరించే అవకాశం లేదా ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు.
Details
అమెరికా వలస చట్టాల ప్రకారం
ప్రతి సంవత్సరం 2,26,000 ఫ్యామిలీ ప్రిఫరెన్స్, 1,40,000 ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు జారీ చేయడానికి వీలుగా ఉంటాయి. గ్రీన్‌కార్డు పొందడంలో I-485 దరఖాస్తుకు ఆమోదం అత్యంత కీలకమైనది. కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రత్యేక దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు యూఎస్‌లో ఉండాలి. చట్టపరంగా అమెరికాకు వచ్చారని నిరూపించే పత్రాలు జనన ధ్రువీకరణ పత్రాలు, వైద్య పరీక్షల రికార్డులు సమర్పించాలి.
Details
అక్టోబర్ 20 నుంచి గ్రీన్‌కార్డు టెస్టింగ్‌లో మార్పులు
ట్రంప్ ప్రభుత్వ కాలంలో వలస విధానాల్లో మార్పులు జరిపారు. గ్రీన్‌కార్డుల పరీక్ష ప్రక్రియలో మార్పులు అక్టోబర్ 20 నుండి అమల్లోకి వస్తాయని USCIS తెలిపింది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం అమెరికా విలువలను పూర్తిగా అంగీకరించే అభ్యర్థులకు మాత్రమే గ్రీన్ కార్డు ఇవ్వడం. దరఖాస్తుదారుల యూఎస్ చరిత్ర, ప్రభుత్వం గురించి అవగాహనను పరీక్షిస్తారు. 20 ప్రశ్నలలో కనీసం 12కి సరైన సమాధానం ఇవ్వడం తప్పనిసరి. అదనంగా అభ్యర్థికి సరైన నైతిక ప్రవర్తన ఉందా అని కూడా టెస్ట్ చేయబడుతుంది.