China: చైనా ఆయుధాలు ఇరాన్‌కు చేరుతున్నాయా.. ఇందులో నిజమెంత?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో చైనా, ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య, అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం బీజింగ్ నుంచి టెహ్రాన్‌కు భారీగా ఆయుధ సరఫరా జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా భుజం మీద నుంచి ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్‌లు, ఇతర క్షిపణి వ్యవస్థలను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఆయుధాలు వారం రోజుల్లో ఇరాన్‌కు చేరే అవకాశముందని తెలిపాయి. తమ పేరు బయటపడకుండా ఉండేందుకు చైనా, ఇతర దేశాల మార్గంగా ఈ సరఫరా నిర్వహిస్తున్నట్లు కథనాలు వెల్లడించాయి.
వివరాలు
బీజింగ్ పేరును ప్రస్తావించలేదు
ఇదే కాకుండా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధనౌకలు, విమానాలు, సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా చైనా, ఇరాన్‌కు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని, ఇవన్నీ అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఇంకా ఒకవైపు ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో కూడా చైనా పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో 'చర్చల వెనుక చైనా ఉందని వ్యాఖ్యానించారు. అయితే అధికారిక ప్రకటనల్లో మాత్రం బీజింగ్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.