Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం
అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భయంకరమైన తుఫాను వల్ల గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ తుఫాను కారణంగా రన్‌వేపై ఉన్న విమానం 90 డిగ్రీలు మలుపు తిరిగిందంటే గాలి తీవ్రత, తుపాను ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోలీ బ్యూనస్ ఎయిర్స్ జార్జ్ న్యూబెర్రీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్క్ చేసిన ఈ విమానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జెంటీనా రాజధానిలో భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.