
Biden visit Israel: రేపు ఇజ్రాయెల్‌కు బైడెన్.. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు నెతన్యాహు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గాజాకు సంబంధించిన అన్ని సరిహద్దులను ఇజ్రాయెల్ దిగ్బంధించింది.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌ను సందర్శించనుండటం ఆసక్తికరంగా మారింది.
తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌కు బైడెన్ తన సంఘాభావం ప్రకటిస్తారని యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో అక్కడి ప్రజలకు అందించే మానవతా సాయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో బైడెన్ చర్చలు జరుపుతారని బ్లింకెన్ అన్నారు.
పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గించేలా, హమాస్‌కు ప్రయోజనం కలిగించేలా, గాజాలోని ప్రజలకు మానవతా సాయం ఎలా అందిస్తారనే దానిపై బైడెన్‌కు నెతన్యాహు వివరించనున్నట్లు బ్లింకెన్ చెప్పారు.
ఇజ్రాయెల్
గాజాకు సాయంపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం
గాజాకు సాయంపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయంపై బ్లింకెన్- బెంజమిన్ నెతన్యాహు మధ్య సోమవారం ఏడు గంటలకు పైగా చర్చలు జరిగాయి.
ఇదిలా ఉంటే, హమాస్ ఉగ్రవాదుల నుంచి తనను తమ ప్రజలను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని బైడెన్ నొక్కి చెప్పినట్లు చర్చల సందర్భంగా బైడెన్ చెప్పుకొచ్చారు.
గాజా పౌరులను యుద్ధంగా దూరంగా ఉంచేందుకు అంతర్జాతీయ సంస్థలతో సహాయ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్-అమెరికా నిర్ణయించాయి.
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన యుద్ధం విషయంలో మానవతావాద కాల్పుల విరమణ కోసం రష్యా రూపొందించిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విఫలమైంది. రష్యన్ తీర్మానంలో హమాస్ పేరు లేకపోవడం గమనార్హం.
ఇజ్రాయెల్
గాజా సరిహద్దులో ఆగిన ట్రక్కులు
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధం కావడంతో.. సరిహద్దులను పూర్తిగా మూసివేసింది.
ఈక్రమంలో గాజాకు వివిధ సంస్ధలు, ఐక్యరాజ్యసమితి మానవతా సాయంగా అందిస్తున్న ఆహారం, దుస్తులు, నీరు కూడిన ట్రక్కులు ఈజిప్ట్ సరిహద్దులో నిలిచిపోయాయి.
ఈజిప్ట్‌తో గాజాకు ఉన్న ఏకైక అనుసంధానమైన రాఫా సరిహద్దు వద్ద అనేక ట్రక్కులు నిలిచిపోయాయి.
ఐక్యరాజ్యసమితి మానవతావాద చీఫ్, మార్టిన్ గ్రిఫిత్స్ ఇజ్రాయెల్, ఈజిప్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
గాజాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజలు తాగునీరు, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యవతిరేకిస్తోంది. గాజా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం పట్ల తాము ఉదాసీనంగా ఉండలేమని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ హెచ్చరించారు.
గాజా
పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి: హమాస్
ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని హమాస్ పిలుపునిచ్చింది. దీనికి బదులుగా తమ కస్టడీలో ఉన్న ఇజ్రాయెలీయేతర బందీలను విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని పాలస్తీనా గ్రూప్ కూడా తెలిపింది.
ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ ఉత్తరం వైపు లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు- ఐడీఎఫ్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
అలాగే హిజ్బుల్లా గ్రూప్ కూడా సరిహద్దులో ఇజ్రాయెల్‌కు చెందిన 5 పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ ప్రకటించింది.
హిజ్బుల్లా దాడులో నేపథ్యంలో వందలాది మంది ఇజ్రాయిలీలు సరిహద్దుకు సమీపంలోని గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.