Page Loader
బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి 
బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి

బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Jun 11, 2023
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో వర్షాలు బీభత్సం సృష్టించడంతో కనీసం 25 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు. అరేబియా సముద్రంలో బిపోర్‌జాయ్ తుపాను అతి తీవ్రంగా బలపడుతున్న నేపథ్యంలో అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అతి తీవ్ర తుపాను పాకిస్థాన్ దక్షిణ భాగాన్ని తాకబోతోంది. తుపాను కారణంగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ, లక్కీ మార్వాట్, కరక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు బలంగా వీస్తుండటంతో చెట్లు నేలకూలాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయి ఆయా జిల్లాలు అంధకారంలోకి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్

సహాయక చర్యలు ముమ్మరం

భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. బాధిత ప్రజలను సురక్షిత పునరావాసానికి తరలించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. గత సంవత్సరం 33 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసిన ఘోరమైన వరదల వల్ల జరిగిన నష్టానికి దేశం ఇప్పటికీ బాధతుడుతోంది. గతేడాది పాకిస్థాన్ వరదల్లో దాదాపు 1,700 మంది ప్రాణాలు కోల్పోగా, 8 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. అత్యంత తీవ్రమైన తుపాను బిపోర్‌జాయ్ ప్రస్తుతం తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో ఉందని, అది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చెప్పింది.