LOADING...
USA: అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం.. ముగ్గురి మృతి 
అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం.. ముగ్గురి మృతి

USA: అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం.. ముగ్గురి మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
07:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా యునైటెడ్ స్టేట్స్‌లోని లూయిస్‌విల్లే నగరంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ సమయంలో యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలి విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీఎస్ ఫ్లైట్ నంబర్ 2976 విమానం అమెరికా సమయానుసారం సాయంత్రం 5.15 గంటలకు హోనులులుకు బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా నిర్ధారించింది. విమానం గాల్లోకి ఎగసిన క్షణాల్లోనే ఆకస్మికంగా మంటలు వ్యాపించి క్షణాల్లోనే నేలమట్టమైంది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గురైన విమానం మెక్‌డోనెల్ డగ్లస్ ఎండీ-11 మోడల్‌కు చెందినదిగా అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న వీడియో ఇదే..