
మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది.
యప్సిలాంటిలోని విల్లో రన్ ఎయిర్‌పోర్ట్‌లో థండర్ ఓవర్ మిచిగాన్ ఎయిర్ షోలో మిగ్-23 విమానం కుప్పకూలింది. డెట్రాయిట్‌కు పశ్చిమాన 30 మైళ్ల (48.2 కిలోమీటర్లు) దూరంలో ఉన్న బెల్లెవిల్లేలోని సమీపంలోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో ఈ రష్యా యుద్ధ విమానం కూలిపోయింది.
ఈ సమయంలో విమానం పలు వాహనాలను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు వేన్ కౌంటీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.
అయితే విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లకు పెద్దగాయాలు కాలేదని తెలుస్తోంది. వారు స్వల్ప గాయాలతో బయపడినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యుద్ధ విమానం కుప్పకూలిన దృశ్యం
Video of plane crashing at the Thunder Over Michigan Air Show and pilots parachuting. Hoping everyone is ok. #thunderovermichigan pic.twitter.com/RtAAjw7OVV
— Dan Phillips (@danphillips46) August 13, 2023