LOADING...
Iran-US: 'చర్చలు వద్దు.. దాడి చేయండి'.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్‌ వ్యక్తి ఆత్మహత్య
'చర్చలు వద్దు.. దాడి చేయండి'.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్‌ వ్యక్తి ఆత్మహత్య

Iran-US: 'చర్చలు వద్దు.. దాడి చేయండి'.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్‌ వ్యక్తి ఆత్మహత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో అమెరికా ఎలాంటి చర్చలు జరపకూడదంటూ ఆ దేశానికి చెందిన ఓ హక్కుల కార్యకర్త అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరాడు. ఇరాన్‌పై అమెరికా దాడి చేయడమే సరైన మార్గమని చెబుతూ అతడు సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో విడుదలైన కొద్దికాలానికే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెలుగులోకి తెచ్చాయి.

వివరాలు 

అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు విజ్ఞప్తులు

మృతుడిని ఇరాన్‌లోని బుషెహర్ నగరానికి చెందిన హక్కుల కార్యకర్త పౌరియా హమీదీగా గుర్తించారు. గతవారం అతడు దాదాపు 10నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశాడు. ఆవీడియోలో అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు విజ్ఞప్తులు చేశాడు. "మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి నేను బతికి ఉండకపోవచ్చు.ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను ఎంత దారుణంగా అణిచివేశారో అంతర్జాతీయ సమాజం తెలుసుకోవాలి.ఇక్కడ మారణహోమం జరిగింది.మా నాయకులు సుమారు 40వేల మందిని హత్య చేశారు.విదేశీ జోక్యం లేకుండా ఇరాన్ నాయకత్వాన్ని ఆపడం సాధ్యం కాదు. ఇప్పుడు మా ఆశలన్నీ అమెరికాపైనే ఉన్నాయి.అలాకాకుండా ఇరాన్‌తో అగ్రరాజ్యం చర్చలు జరిపితే అది మమ్మల్ని మోసం చేసినట్లే.ఇరాన్‌తో సంప్రదింపులు వద్దు.మా దేశంపై దాడి చేయండి"అని హమీదీ వీడియోలో కోరాడు.

వివరాలు 

ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు

అయితే, ఈ వీడియోను అతడు ఖచ్చితంగా ఎప్పుడు విడుదల చేశాడు? హమీదీ ఎలా మృతి చెందాడు? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల ఇరాన్‌లో జరిగిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిరసనకారులను అణచివేసే క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, మరణాలపై అధికారిక గణాంకాలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా భారీ స్థాయిలో సైనిక మోహరింపులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement