Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్ దాడి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీరక యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలను టార్గెట్ చేస్తున్నారు. ఎర్ర సముద్రం (Red Sea) లో ఇప్పటికే పలు ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు సంబంధించిన వాణిజ్య నౌకలపై దాడి చేసిన హౌతీ తిరుగుబాటుదారులు తాజాగా భారత్ షిప్‌లను టార్గెట్ చేశాయి. శనివారం మధ్యాహ్నం భారత ఫ్లాగ్ ఉన్న ఇంధన నౌకపై మిలిటెంట్లు డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. రెండు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులను భారత జెండా ఉన్న నౌకపై ప్రయోగించినట్లు, ఇవి హౌతీ నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి వచ్చినట్లు యూఎస్ కమాండ్ వెల్లడించింది.
అరేబియా సముద్రంలో దాడి చేసింది ఇరాన్ పనే: అమెరికా
గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం మీదుగా భారత్ వస్తున్న కెమికల్ ట్యాంకర్‌పై శనివారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. అయితే డ్రోన్ దాడిపై అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది. ఈ డ్రోన్ దాడి చేసింది హౌతీ తిరుగుబాటులుగా పెంగగాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రోత్సాహంతోనే హౌతీ మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లు పెంటగాన్ పేర్కొంది. కెమికల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినప్పుడు అందులో మంటలు చెలరేగాయి. అనంతరం సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ దాడి వల్ల పెద్ద నష్టమేమి జరుగలేదని అధికారులు తెలిపారు. గుజరాత్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా.. కెమికల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది.