
పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది మరణించారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులతో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
పేలుడు జరిగిన సమయంలో వాహనం మచ్ని నుంచి పెషావర్ వైపు వెళుతోంది.
ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఉపయోగించినట్లు ఎస్పీ మహ్మద్ అర్షద్ ఖాన్ తెలిపారు. పేలుడు ప్రభావంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది.
ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మాలి ఖేల్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరణించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దాడికి బాధ్యత వహించిన 'టీటీపీ'
Bomb Blast In Pakistan's Peshawar Kills Security Personnel, Several Injured https://t.co/NvM1Xtwe43 pic.twitter.com/0AGXfeSgKv
— NDTV (@ndtv) September 11, 2023