South Korea: 6 గంటల హైడ్రామా.. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టు విఫలమైంది.
శుక్రవారం తెల్లవారుజామున, కోర్టు అంగీకారంతో కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు.
అయితే, అక్కడ చాలా సమయం అడ్డగింత ఎదురైంది. చివరకు, అధ్యక్ష నివాసం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
యూన్‌పై ఎమర్జెన్సీ మార్షల్ లా కేసులో విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ అయింది.
అయినప్పటికీ, యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందం, వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ అడ్డంకులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆరు గంటల హైడ్రామా తర్వాత అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది.
వివరాలు
కోర్టు యూన్‌పై అరెస్టు వారెంట్ జారీ
మార్షల్ లా కేసులో అధ్యక్ష భవనంలో సోదాలు జరిపేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ప్రతిఘటన ఎదురైంది.
అయినప్పటికీ, పోలీసుల సహకారంతో లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు.
విచారణకు హాజరుకాకపోవడంతో, కోర్టు యూన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అరెస్టు జరిగితే, యూన్‌ను గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించి విచారణ జరపనున్నారు.
48 గంటల పాటు అదుపులో ఉంచే అధికారం సీఐవోకు ఉంటుంది, అయితే అదుపు కొనసాగించేందుకు కోర్టు అనుమతి అవసరం.
దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తవి కావు. 2000, 2004లో చట్ట సభ్యుల అరెస్టుకు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వివరాలు
తీర్మానానికి అనుకూలంగా పార్లమెంట్‌లో 204 ఓట్లు
ఇప్పుడు కూడా యూన్ అనుచరులు అధ్యక్ష భవనం వద్ద భారీగా మోహరించారు.
స్వల్ప ఘర్షణలు చోటు చేసుకోవడంతో 2,700 మంది పోలీసులను మోహరించారు. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేశారు.
మార్షల్ లా ఉత్తర్వుల కారణంగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ తీర్మానానికి అనుకూలంగా పార్లమెంట్‌లో 204 ఓట్లు లభించాయి.
ఫలితంగా, యూన్ తన అధికారాలను తాత్కాలికంగా ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి వచ్చింది.
కోర్టు 180 రోజుల్లో ఆయన పదవి భవిష్యత్తు నిర్ణయించనుంది. స్వచ్ఛందంగా అధ్యక్ష పదవిని వీడే అవకాశం ఉన్నట్లు ఆయన సలహాదారులు పేర్కొన్నారు.