Kamala Harris: కమలా హ్యారిస్ ఇంట్లోకి చొరబాటు యత్నం.. బయటే అడ్డుకున్న సిబ్బంది
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 14, 2026
10:09 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇంట్లోకి ఓ మహిళ అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను భద్రతా సిబ్బంది ఇంటి బయటే అడ్డుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. కాలిఫోర్నియాలోని మలీబులో ఉన్న కమలా హ్యారిస్ ఇంట్లోకి శుక్రవారం రాత్రి ఈ చొరబాటు యత్నం జరిగినట్లు ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది తెలిపారు. వారి నుంచి సమాచారం అందడంతో లాస్ ఏంజెలెస్ కౌంటీ షరీఫ్ డిప్యూటీలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే సమయానికి భద్రతా సిబ్బంది అనుమానిత మహిళను ఇంటి బయటే అడ్డుకున్నారు.
వివరాలు
ఎలాంటి హానీ జరగలేదు
అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో కమలా హ్యారిస్‌కు ఎలాంటి హాని జరిగినట్లు సమాచారం లేదు.